కరోనా పూర్తిగా అంతం కావాలని పశ్చిమబంగాకు చెందిన అద్దంకి రవి పాదయాత్ర చేపట్టారు. పశ్చిమబంగా ఖరగ్పూర్ నుంచి తిరుపతికి ఈ నెల 10వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై లొద్దపూట్టి కూడలి వద్ద స్థానికులు అద్దంకి రవికి స్వాగతం పలికారు.
కరోనా వైరస్ అంతమై, దేశానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి : గతంలో కంటే నాలుగు స్థానాలు అధికంగా వస్తాయి: కేసీఆర్