రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది.
వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు