అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల నుంచి నీరు, మట్టిని పంపుతున్నారు. భాజాపా నేతలు తిరుమలకు చేరుకుని శ్రీవారి పుష్కరిణిలోని నీటిని, నారాయణగిరి పర్వతంలో పుట్ట మట్టిని సేకరించి... వాటిని అయోధ్యకు పంపే ఏర్పాట్లు చేశారు.
ఆగస్టు 5న రామమందిర నిర్మాణం పునాదిలో నీటిని, మట్టిని వినియోగించనున్నట్లు భాజాపా నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యం వద్దు.. కరోనాకు చంపే శక్తి లేదు: మంత్రి ఈటల