కరోనా నిబంధనల పేరుతో సికింద్రాబాద్ కంటైన్మెంట్లోని రోడ్లను ఆర్మీ అధికారులు మూసివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నట్లు కంటైన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. నేటి నుంచి పది రోజులపాటు రోడ్లను పూర్తిగా మూసివేయాలన్న నిర్ణయం సరైనది కాదని ఆయన అన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సమస్యలపై స్పందించడం లేదని బోర్డ్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా ఎంపీలు సైతం కంటైన్మెంట్ విషయమై ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడం శోచనీయం వ్యాఖ్యానించారు. సమస్యలపై చిత్తశుద్ధి లేని నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండడం కంటే రాజీనామా చేయడం మంచిదని ఆయన ఘాటు విమర్శలు గుప్తించారు.
- ఇదీ చూడండి: ఆయోధ్యలో రామాలయ నిర్మాణం అప్పుడే!