Vitamin C Deficiency in Telugu : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తగిన పోషక విలువలు అందించాలి. అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు అధికంగా లభించే ఆహారం ఎక్కువగా తినాలి. విటమిన్ల లోపం వల్ల అనేక వాధ్యుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అందుకే విటమిన్లు అనేని శరీరానికి చాలా ముఖ్యం. అన్నింటికంటే శరీరానికి విటమిన్ సి అనేది ఇంకా ముఖ్యం.
శరీరంలో విటమిన్ సి లోపించిందని తెలుసుకోండి ఇలా : తరచు అలసట, పాలిపోయిన చర్మం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఐరన్ లోపం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు విటమిన్ సి కారణంగా శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. కండరాలు బలహీనంగా అనిపించడం, శారీరక బలం తగ్గటం.. శరీరంలో విటమిన్ సి లోపించింది అనడానికి ఒక సూచన. దంత సమస్యలు, చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటివి కూడా కొన్ని సార్లు అవుతుంటాయి. విటమిన్ సి లోపించింది అనడానికి కారణం.
Foods to Overcome Vitamin C Deficiency : ఇది శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సంరక్షిస్తుంది. శరీరంలో కావాల్సినంతా విటమిన్ సి లేకపోతే గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది. చర్మం పొడిబారటం, గరుకుగా అనిపించడం, జుట్టు చివర్లు పగలడం. గోళ్లు పెరగకపోవటం ఇలాంటివి జరుగుతాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పడు విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Stomach Pain After Eating : తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉందా? అల్సర్ కారణమా? తగ్గాలంటే ఏం చేయాలి?
ఇవి తిని విటమిన్ సి లోపానికి చెక్ పెట్టండి :
- ఉసిరికాయ, రేగిపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా అనేక రోగాల నుంచి రక్షిస్తుంది. అందుకే రోజు తినే ఆహారంలో ఉసిరికాయ, రేగిపండ్లను అలవాటు చేసుకోండి.
- నిమ్మజాతి పండ్లలో కూడా విటమిన్ సి అధికంగా లభిస్తుందని పోషకహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ, ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అని అంటున్నారు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతున్నారు.
- స్టాబెర్రీ, రెడ్ బెర్రీ, బ్లూబెర్రీ లాంటి అన్నీ బెర్రీ ఫ్రూట్స్‌లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పులుపు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోజువారి ఆహారంలో ఇలాంటి పండ్లు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
- ఫైనాపిల్, దానిమ్మ, పచ్చి మామిడికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఈ లోపం నుంచి బయటపడవచ్చు.
- అన్ని రకాల క్యాప్సికంలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్యాబేజీ, పాలకూర లాంటి వాటిల్లోనూ సమృద్ధిగా ఉంటుంది.
- జామకాయ, క్యారెట్, టమాటాలో కూడా విటమిన్ సి లభిస్తుంది. ఒక్క జామకాయలోనే ఒకరోజు శరీరానికి కావాల్సిన 68 శాతం ఉంటుంది.
Health Benefits Of Turmeric : చిటికెడు పసుపుతో ఎన్నో లాభాలు.. డయాబెటిస్ కంట్రోల్!
Monsoon Diet in Telugu : చల్లటి వానలో వేడివేడి మిర్చిబజ్జీ తింటున్నారా.. ఐతే బీ కేర్ఫుల్