దేశవ్యాప్తంగా ఐక్యతా దినోత్సవ వేడుకలు జరుగుతున్నా.. హైదరాబాద్ సంస్థాన విలీనంలో ఆయన పోషించిన ముఖ్య భూమిక తనను ఇక్కడి వేడుకల్లో పాల్గొనేలా పురిగొల్పిందని వెంకయ్యనాయుడు తెలిపారు. సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లాభాయ్ పటేల్ వంటి మహనీయుల చరితలను భావితరాలకు చేరవేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశప్రజలంతా ఐక్యతతో మెలిగి.. దేశ అభ్యున్నతిలో భాగస్వాములు కావడమే మనం ఆ మహనీయులకు ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు.
ఇదీ చూడండి: దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ