మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని.. కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించాలని.. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బండారు దత్తాత్రేయ గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు తన హృదయానికి దగ్గరగా ఉంటాయన్నారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని ఉద్ఘాటించారు.
కులమతాలను పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు వెళ్లాలనేదే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైందని వెల్లడించారు. తెలంగాణలో బతుకమ్మ, బోనాల పండుగలు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతిని తెలుపుతుందన్న వెంకయ్య... రాష్ట్రంలోని ప్రతిఒక్కరు ఈ పండుగలో పాల్గొనాలని సూచించారు.
భారతీయులైనందుకు, తెలుగు వారైనందుకు గర్వపడాలని ప్రజలకు సూచించారు. పాశ్చాత్య వ్యామోహం కారణంగా అలవాట్లు, అభిరుచులు మారుతున్నాయని.. మళ్లీ మన సంస్కృతిని అలవరచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రకృతితో కలిసి జీవించాలని ప్రజలకు వివరించారు. ఎంత పెద్దవాళ్లైనా నియమ నిబంధనలు పాటించాలని.. లేకుంటే కష్టం, నష్టం వాటిల్లుతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య స్పష్టం చేశారు.
ప్రకృతితో కలిసి జీవించండి... ప్రకృతిని కాపాడండి: ఉపరాష్ట్రపతి
కరోనా ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించాలి. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. సంస్కృతి, సంప్రదాయాలు నా హృదయానికి దగ్గరగా ఉంటాయి. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులం. ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలి. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైంది. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రతిఒక్కరూ పండుగల్లో పాల్గొనాలి. పాశ్యాత్య వ్యామోహం కారణంగా రుచులు- అభిరుచులు మారుతున్నాయి. ప్రకృతితో కలిసి జీవించండి... ప్రకృతిని కాపాడండి. -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి: Alai-Balai 2021: అలయ్ బలయ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. గవర్నర్ తమిళిసై ఆట.. పవన్...