ETV Bharat / state

చివరి అవకాశం వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం

అనధికార ప్లాట్ల, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్‌లో మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనధికార ప్లాట్‌ను క్రమబద్ధీకరించుకోవాలంటే రూ.1000 రుసుంతో పాటు సంబంధిత ప్లాట్‌ సేల్‌ డీడ్‌ మొదటి పేజీ జత చేయాలి. అక్రమ లేఅవుట్‌ను క్రమబద్ధీకరించుకోవాలంటే రూ.10 వేల రుసుంతో పాటు స్కాన్‌ చేసిన లేఅవుట్‌ ప్లాన్‌, యాజమాన్యం సేల్‌ డీడ్‌ ప్రతులు, విక్రయించిన ప్లాట్ల ఈసీలు సమర్పించాలి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. మీ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోండి.. అంటూ ఆయా నగరాలు, పట్టణాల్లో ‘ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా’లు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని పురపాలక నిర్వహణ సంచాలకులు నగర పాలక, పురపాలక కమిషనర్లను ఆదేశించారు. ఆగస్టు 26వ తేదీలోగా రిజిస్టర్‌ అయిన ప్లాట్లకు మాత్రమే తాజా ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించనుండగా అక్టోబర్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Verification process of LRS applications in nalgonda district
చివరి అవకాశం వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం
author img

By

Published : Sep 28, 2020, 1:11 PM IST

అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన రుసుంను మూడు విధాలుగా లెక్కిస్తారు. ప్లాటు విసీ్తీర్ణం, ప్లాటు విసీ్తీర్ణం, ప్లాటు మార్కెఫట్‌ విలువతోపాటు మొత్తం స్థలం విసీ్తీర్ణంపై చెల్లించాల్సిన రుసుంను మొత్తం కలిపి చెల్లిస్తేనే ఆయా ప్లాటును క్రమబద్ధీకరిస్తారు. రుసుం చెల్లింపునకు చదరపు మీటర్లలో మార్కెఫట్‌ విలువను చదరపు గజాల ప్రకారం చెల్లిస్తారు.

వివరాలిలా...

ఇలా లెక్కిస్తారు..

సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 200 గజాల(167.22 చ.మీటర్ల) ప్లాటు ఉంది. దీనికి ప్రస్తుతం మార్కెట్‌ విలువ గజానికి రూ.3 వేల ధర పలుకుతోంది. ఆయన 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అప్పుడు దాని మార్కెట్‌ విలువ గజానికి రూ.2 వేలు ఉంది. దీన్ని క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు ప్రస్తుత మార్కెట్‌ విలువతో లెక్కిస్తారు. అయితే 200 గజాలను అప్పటి మార్కెఫట్‌ విలువ రూ.2 వేలతో గుణిస్తే 4,00,000 అవుతుంది. దీనికి ఖాళీ స్థలం(ఓపెన్‌ స్పేస్‌) ఛార్జీలు 14 శాతం చెల్లించాలి. రూ.4,00,000ను 14 శాతంతో లెక్కిస్తే రూ.56,000 అవుతుంది. 167.22 చ.మీ స్థలానికి బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు రూ.400తో లెక్కిస్తే రూ.66,888 అవుతుంది. దీనిలో క్రమబద్ధీకరణ రుసుం 20 శాతం తీసుకుంటే రూ.13,378 అవుతుంది. ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు 56,000తోపాటు బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు రూ.13,378ని కలిపితే మొత్తంగా ఆయన 69,378 ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం కింద చెల్లించాల్సి ఉంటుంది.

* రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెఫట్‌ విలువతో ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు లెక్కించి, బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు ప్రస్తుతం దీనికి అనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ జీఓలోని పై టేబుల్‌లోని శాతాలతో గుణిస్తే ఎంత చెల్లించాలో తెలుస్తుంది.

వివరాలిలా..

సద్వినియోగం చేసుకోవాలి

సామాన్యులు మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అనుమతి లేని వెంచర్లలో ఇళ్ల నిర్మాణం చేపడితే లబ్ధిదారులను కష్టాల్లోకి నెడుతుంది. పురపాలికల్లో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న వెంచర్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.- రామాంజులరెడ్డి, సూర్యాపేట పుర కమిషనర్‌

చరవాణి నుంచే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు

చరవాణి నుంచే

అనధికారిక ప్లాట్లు, లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌కు కరోనా అడ్డంకి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్‌ కోసం బయటకు రాకుండా చరవాణి ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆగస్టు 26వ వరకు రిజిస్టర్‌ అయిన అనధికారిక ప్లాట్లు, లేఅవుట్‌లు అవి గ్రామపంచాయతీల పరిధిలోవి అయినా పురపాలక పరిధిలోవి అయినా దరఖాస్తు చేసుకోవచ్ఛు.

చరవాణి ద్వారా దరఖాస్తు ఇలా..

అంతర్జాలంలో ఎల్‌ఆర్‌ఎస్‌.తెలంగాణ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దీనికి తోడు చరవాణిలో ఎల్‌ఆర్‌ఎస్‌.2020 అనే యాప్‌ను దిగుమతి చేసుకొని వాటి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు

  • అక్కడ ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లై-2020 అనే అంశం వస్తుంది. దానిని ఎంపిక చేసుకుంటే చరవాణి నెంబర్‌ అడుగుతుంది.
  • చరవాణి నెంబర్‌ను నమోదు చేయండి. వెంటనే చరవాణికి ఓటీపీ నెంబర్‌ వస్తుంది. ఆ ఓటీపీని కూడా నమోదు చేయండి. అప్పుడు మీకు దరఖాస్తు ఫారం వస్తుంది.
  • వచ్చిన దరఖాస్తు ఫారంలో ప్లాటు, లేఅవుట్‌ అని రెండు కన్పిస్తాయి. అక్కడ మీరు ఏది కావాలనుకుంటున్నారో ప్లాటు లేదా లేఅవుట్‌ అది ఎంపిక చేసుకోవాలి.
  • ఇప్పుడు మీరు ప్లాటుకు సంబంధించిన సర్వే నెంబరు, ప్లాటు ఉన్న స్థలం, ఎన్నిగజాలు, డాక్యుమెంటు రిజిస్టరు నెంబర్‌, సంవత్సరం వివరాలు నమోదు చేయాలి.
  • ప్లాటుకు సంబంధించిన వారి వ్యక్తిగత వివరాలతో పాటు, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
  • నగదు చెల్లింపునకు ఐసీఐసీఐ గేట్‌వే-1, ఐసీఐసీఐ గేట్‌వే-2 అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో రెండో ఆప్షన్‌ ఎంచుకోవటం వల్ల డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్ఛు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.