ETV Bharat / state

కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం అభినందనీయం: వెంకయ్యనాయుడు - Venkaiah Naidu latest news

Venkaiah reaction on Central govt decision: కన్న తల్లి, మాతృ భాష, జన్మ భూమిని ఎప్పుడూ మర్చిపోవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ పరీక్షలను మాతృభాషలో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మాతృభాషను పరిరక్షించగలుగుతామని తెలిపారు. నార్సింగిలో నిర్వహించిన తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వెంకయ్యనాయుడు
వెంకయ్యనాయుడు
author img

By

Published : Jan 22, 2023, 5:47 PM IST

Venkaiah naidu at sankranti sammelanam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను భారతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించడం పట్ల భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. హైదరాబాద్ నార్సింగిలో తెలుగు సంగమం నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. భారతీయ సంస్కృతిలో భాగమైన భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కన్నతల్లి, మాతృభాష, జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోవద్దని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రభుత్వాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మాతృభాషను పరిరక్షించగలుగుతామని పేర్కొన్నారు. ఉన్నత విద్యతో పాటు సాంకేతిక, వైద్య, న్యాయ విద్యల్లోనూ భారతీయ భాషలకు పెద్దపీట వేయాలని కోరారు. చదువు కోసమే కాకుండా పరిపాలన కూడా మాతృభాషలోనే జరగాలని ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు.. ప్రభుత్వాలు ఇంగ్లీష్​లో ఉత్తర్వులు ఇచ్చి తెలుగులో కాపీ ఇవ్వడం సమంజసం కాదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో కోర్టు తీర్పులు కూడా అన్ని భారతీయ భాషల్లోనే ఇవ్వాలని సూచించారు. ఈ వేడుకల్లో వెంకయ్యనాయుడుతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ దర్శకులు రాఘవేందర్​రావు, పద్మశ్రీ శోభారాజు, ప్రముఖ రచయిత ఆకెళ్ల, బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్​రావు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

కన్నతల్లి, మాతృ భాష, జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోవద్దు. తొలిసారిగా స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ పరీక్షలు మాతృభాషల్లో కేంద్రం నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషల్లో వెలువడాలి. చట్ట సభల్లోనూ మాతృభాషల్లో నిర్భయంగా మాట్లాడాలి. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు మాతృభాషలో మాట్లాడాలని ఎంతోమందిని ప్రోత్సహించాను. మన దేశం శక్తిమంతంగా ముందుకెళ్తోంది. త్వరలో ప్రపంచంలోనే కీలకమైన దేశంగా భారత్ ఎదుగుతుంది. - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం అభినందనీయం: వెంకయ్యనాయుడు

ఇవీ చూడండి..

కోల్‌ ఇండియా కన్నా సింగరేణి కార్మికులకు ఎక్కువగా ఇస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత

బాక్సాఫీస్​ వద్ద బాలయ్య-వీరయ్య జోరు.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.