ETV Bharat / state

Venkaiah Naidu Comments on Politics : 'రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ఏర్పడింది.. అది మారాల్సిన అవసరం ఉంది'

Venkaiah Naidu Comments on Politics : రాజకీయాల్లో రూ.కోట్లులేనిదే ఓట్లు రావనే పరిస్థితి ఏర్పడిందని.. అది మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో జరిగిన సిటిజన్​ యూత్​ పార్లమెంట్​ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Venkaiah Naidu Latest Speech
Venkaiah Naidu Paticipate Citizen Youth Parliament Program
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 2:18 PM IST

Updated : Oct 8, 2023, 2:25 PM IST

Venkaiah Naidu Comments on Politics : భారతదేశం వేగంగా ముందుకు సాగాలంటే రాజకీయాల్లో యువత పాలుపంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. నీతి, నిజాయతీ, విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావాలని చెప్పారు. హైదరాబాద్​లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCRHRD)లో జరిగిన సిటిజన్​ యూత్​ పార్లమెంట్​ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిటిజన్​ యూత్​ పార్లమంట్​ కార్యక్రమం ఆలోచనలను పంచుకునేందుకు.. పెంచుకునేందుక చక్కటి అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు.

Venkaiah Naidu Speech at Citizen Youth Parliament Program : దేశంలోని పార్లమెంట్​ వ్యవస్థలో ముందడుగు వేయలని చెప్పారు. భారతదేశం వేగంగా ముందుకు వెళ్లాలంటే యువత పాలుపంచుకోవాలని తెలిపారు. రాజకీయాల్లోకి యువత రావాలని.. నీతి, నిజాయతీ, విలువలతో కూడిన రాజకీయాలను ఏర్పరచాలని చెప్పారు. అలా ముందుకు వచ్చినప్పుడే ఆదర్శ, సిద్దాంత రాజకీయాలు వస్తాయని పేర్కొన్నారు. దేశ చరిత్ర, త్యాగాలు, పోరాటాలు, సవాళ్లు అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్​ రాజకీయ నాయకుల చరిత్ర తెలుసుకోవాలని.. పాలిటిక్స్​లోకి వచ్చేందుకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్​ అవసరం లేదని అన్నారు.

భ్రష్టుపడుతోన్న రాజకీయాలను యువతే బాగుచేయాలి : వెంకయ్య నాయుడు

Venkaiah Naidu Suggestions For Youth : రాజకీయాలంటే ఒక పార్టీ వదిలి.. ఇంకో పార్టీలోకి వెళ్లడం కాదని వివరించారు. ఆ పార్టీనే నమ్మి.. అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు. దీనికి ఉదాహరణగా తన జీవిత అనుభవాల గురించి తెలిపారు. నమ్మిన సిద్ధాంతం వల్లే ఉపరాష్ట్రపతి స్థాయికి చేరుకున్నానని హర్షం వ్యక్తం చేశారు. యువత కష్టపడాలని.. క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని సూచించారు. ఏ విషయంలోనైనా చెయ్యాలనే తపన ఉండాలని ఉత్తేజపరిచారు. 'యోగ ఫర్ బాడీ నాట్ ఫర్ మోదీ(Yoga for Body not for Modi)' అని ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటలు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శరీర ఆరోగ్యం పెంచుకోవాలని అన్నారు.

"యువత రాజకీయాల్లోకి రావాలి. నిలకడ కలిగిన పార్టీలో ఉండండి. విలువలతో కూడిన రాజకీయాలు పాటించండి. కులం, మతం, ప్రాంతం, వర్గం, భాష వీటికి అతీతంగా ప్రవర్తించి గొప్ప నాయకులు అవ్వాలి."- వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

Venkaiah Naidu Comments on Politics రాజకీయాల్లో రూ కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ఏర్పడింది అది మారాల్సిన అవసరం ఉంది

Venkaiah Naidu Reaction on Asian Games : ఆసియా క్రీడల్లో 107 పతకాలు ఇండియా సాధించడం గర్వకారణంగా ఉందని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఈ విధంగా మరింత వేగంగా అభివృద్ధితో ముందుకు దూసుకుపోవాలని ఆశించారు. మాట, పాట, ఆట జీవితానికి మంచి బాట వంటివని అన్నారు. ప్రతి ఒక్కరికి సంగీతం, సాహిత్యం, భాష పరిజ్ఞానం అవసరమని వెల్లడించారు. ఒక ప్రాంతానికి భాష పోతే శ్వాశ ఆగినట్టేనని.. అందువల్ల జన్మనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు, దేశం, మాతృభాషను మర్చిపోకూడదని అన్నారు. మాతృభాష కంటి చూపు వంటిదని.. ఆంగ్ల భాష కళ్ల జోడు లెక్క అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలి: వెంకయ్యనాయుడు

'భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదు'

Venkaiah Naidu: 'రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి'

Last Updated : Oct 8, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.