హైదరాబాద్‌లో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఏంజే మార్కెట్లో లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో భాగ్యనగరంలో లాక్ డౌన్‌ను పోలీసులు మరింత కఠినతరం చేశారు. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఎంజే మార్కెట్లో పెద్ద ఎత్తున వాహనాల రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొంతమంది వాహనదారులు పోలీసులతో వాగ్వావాదానికి దిగడంతో... కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రవాణాశాఖలో తగ్గిన వాహనాల కొనుగోళ్లు