Vegetables Price Dropped in Telangana : గత రెండు నెలలు కూరగాయల (Vegetable Prices in Telangana) ధరలు ఆకాశాన్నంటాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. నెలకిందట కిలో రూ. 180 నుంచి రూ.200 ధర పలికిన టామాట.. ఇప్పడు రైతు బజార్లలో రూ. 15గా ఉంది. బహిరంగ మార్కెట్లలో రూ. 20లకి విక్రయిస్తున్నారు. మాల్స్‌లో రూ.25 కిలోకి అమ్ముతున్నారు. టమాట ధరతో పాటు గతంలో పచ్చిమిర్చి(Mirchi Price Today) ధర కూడా గతంలో రూ.200 దాటింది.. ప్రస్తుతం దాని ధర రైతుబజార్లలో కిలో రూ.25 పలుకుతోంది. పంటలు చేతికి రావడం.. మార్కెట్లకు సరుకు ఎక్కువగా రావడంతో కూరగాయలు రేట్లు తగ్గాయి.
Vegetables Price Today Telangana : వేసవిలో పడిన అకాల వర్షాలకు రైతులకు అధిక మొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత జూన్ మాసంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల పంట దెబ్బతిన్నాయి. రుతుపవనాల ఆలస్యం కారణంగా విత్తనాలు వేసినా విత్తక పోవడం.. దానివల్ల రైతులు నష్టం పోవడం వల్ల ఉత్పత్తి మరింత తగ్గిపోయింది. దీంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.
Vegetables Price Hike in Telangana : కూరగాయలు ధరలు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే!
Tomato Price Today in Telangana : మొదట్లో టమాట ధర ఒక్కటే పెరిగింది. తర్వాత దాని ప్రభావం కూరగాయల మీద కూడా పడింది. జూన్ మూడో వారం నాటికి టమాట ధర కిలో రూ.100 దాటింది. తర్వాత మెలిమెల్లిగా పెరుగుతూ రూ.200కు చేరుకుంది. కూరగాయల ధరలు ఒక లెక్కన పెరిగితే పచ్చిమిర్చి ధర కూడా బాగా పెరిగిపోయింది. ఆగస్టు రెండో వారం వరకు కూడా టమాట (Tomato Price Today) ధర అలాగే ఉంది. తరువాత నుంచి క్రమంగా టమాట ధర తగ్గుదల మొదలైంది. ప్రస్తుతం దాని ధర రూ.15కు చేరింది. రైతు బజార్లలో వంకాయ కిలో రూ.18 ఉండగా, బెండకాయ రూ.23, బీరకాయ రూ.18, కాకరకాయ రూ.23, దొండకాయ రూ.18, బీన్స్ రూ.35, కాలిఫ్లవర్ ధరు రూ.18, క్యాబేజీ రూ.13, ఆలుగడ్డ రూ. 21, కీరదొస రూ.13గా ఉండగా.. ఉల్లి కిలో రూ.21 గా ఉంది.
Vitamin C Foods : విటమిన్ 'సి' లోపమా? ఇవి తినేయండి.. అంతా సెట్!
Vegetables Rates Today in Telangana : రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, కరీంనగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున కూరగాయలు పండిస్తున్నారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మార్కెట్‌కు రోజూ 80 క్వింటాళ్ల టమాట వస్తుంది. ఎర్రగడ్డ మార్కెట్‌కు 110 క్వింటాళ్ల టమాటాలు వస్తున్నాయి. ఇతర కూరగాయలు రెండు మార్కెట్లకు 1100 టన్నులకు పైగా వస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ మార్కెట్లకు టమాటాల రవాణా పెరిగింది. కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉన్నందున ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని మెహిదీపట్నం రైతుబజార్ ఎస్టేట్ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు.
Vegetables at Kg 20 : వ్యాపారి పెద్ద మనసు.. ఏ కూరగాయ కొన్నా కేజీ రూ.20 మాత్రమే