ETV Bharat / state

భారత రక్షణ రంగం అమ్ములపొదిలో వరుణాస్త్రం

author img

By

Published : Nov 21, 2020, 10:58 PM IST

భారత రక్షణ రంగం అమ్ములపొదిలో కొత్త అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన హెవీ వెయిట్ టోర్పెడో వరుణాస్త్రను నౌకాదళానికి లాంఛనంగా అప్పగించారు. ఏపీ విశాఖలోని భారత డైనమిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో రక్షణ పరిశోధన రంగ కార్యదర్శి, డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్​రెడ్డి వరుణాస్త్రను అప్పగించారు.

భారత రక్షణ రంగం అమ్ములపొదిలో వరుణాస్త్రం
భారత రక్షణ రంగం అమ్ములపొదిలో వరుణాస్త్రం

భారత నౌకాదళానికి వరుణాస్త్రం చేరింది. ఏపీ విశాఖలోని నౌకా సమరశాస్త్ర ప్రయోగశాల ఎన్.ఎస్.టి.ఎల్ రూపొందించిన ఈ భారీ టార్పెడోను.. భారత డైనమిక్స్ లిమిటెడ్- బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ టార్పెడోను శనివారం నౌకాదళానికి అప్పగించారు. భారత రక్షణ పరిశోధన శాఖ కార్యదర్శి, డీఆర్​డీవో ఛైర్మన్ సతీశ్​రెడ్డి చేతుల మీదుగా నౌకాదళానికి అందజేశారు. విశాఖలోని బీడీఎల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో షిఫ్ బిల్డింగ్ సెంటర్ డైరక్టర్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్, బీడీఎల్ సీఎండీ సిద్దార్థ్ మిశ్రా, ఎన్.ఎస్.టి.ఎల్ డైరక్టర్ నందగోపన్ పాల్గొన్నారు.

భవిష్యత్ క్షిపణులు బీడీఎల్​లోనే..

రక్షణశాఖ పరిధిలోని ఎన్ఎస్​టీఎల్, బీడీఎల్ సమన్వయంతో పనిచేసి అత్యాధునికమైన టార్పెడోను అందించాయని డీఆర్​డీవో ఛైర్మన్ సతీశ్​​రెడ్డి అభినందించారు. భవిష్యత్​ అవసరాల దృష్ట్యా అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను బీడీఎల్ ఉత్పత్తి చేయనుందని చెప్పారు. ఎన్ఎస్​టీఎల్ రూపొందించిన వరుణాస్త్రను విశాఖలోని బీడీఎల్ యూనిట్​లోనే ఉత్పత్తి చేయనున్నారు.

రక్షణశాఖ ఈ టార్పెడోలను ఎగుమతి కూడా చేయనుంది. వీటితోపాటు త్వరితగతిన స్పందించే ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే "క్యూఆర్ ​శామ్" క్షిపణి వ్యవస్థను బీడీఎల్ రూపొందిస్తుంది. ఈ మధ్యనే దీనిని విజయవంతంగా ప్రయోగించారు. ఇది కాకుండా భారత వాయుసేన కోసం గాలిలో ప్రయోగించే "అస్త్ర" క్షిపణులను కూడా బీడీఎల్ ఉత్పత్తి చేయనుంది.

ఎయిర్ లాంచ్ టెస్ట్ సదుపాయం ప్రారంభం..

విశాఖలోని ఎన్ఎస్​టీఎల్​లో ఎయిర్ లాంచ్ టెస్ట్ స‌దుపాయం అందుబాటులోకి వ‌చ్చింది. ఇటీవ‌లే ఎన్ఎస్​టీఎల్​లో సిద్ధం చేసిన ఎయిర్ లాంచ్ టెస్ట్​ను డీఆర్​డీవో ఛైర్మ‌న్ స‌తీశ్​రెడ్డి ప్రారంభించారు. ఈ స‌దుపాయాన్ని నెల‌కొల్పి, విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన ఎన్​ఎస్​టీఎల్ బృందాన్ని ఆయ‌న అభినందించారు. భ‌విష్య‌త్​లో జ‌రిగే ప్ర‌యోగాల‌ను ఈ స‌దుపాయం ద్వారా విజ‌య‌వంతంగా పూర్తి చేయాల‌ని ఆకాంక్షించారు.

నౌకాద‌ళంలో ఎయిర్ క్రాప్ట్, హెలీకాప‌ర్ట్ సేవ‌ల అవ‌స‌రం, వాటికి కావాల్సిన సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంతో ప్రాముఖ్యత క‌లిగి ఉన్నాయ‌ని ఎయిర్ సిస్ట‌మ్స్ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ ఆర్​వీఎస్ సుబ్ర‌మ‌ణ్యం వివ‌రించారు. ఎన్ఎస్​టీఎల్ ప్రాజెక్టులను స‌కాలంలో పూర్తి చేయడానికి ఈ స‌దుపాయం ఉప‌క‌రిస్తుంద‌న్నారు. నేవ‌ల్ సిస్ట‌మ్స్ మెటీరియ‌ల్స్ డీజీ స‌మీర్ వి. కామ‌త్, ఎన్​ఎస్​టీఎల్ డైరెక్ట‌ర్ ఓఆర్ నంద‌గోప‌న్, వైస్ అడ్మిరల్ (రిటైర్డ్) కె.ఓ. ధాకరే స‌హా సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త‌లు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.