ETV Bharat / state

సజావుగా వ్యాక్సినేషన్... ఇక ప్రైవేట్ వైద్య సిబ్బందికి! - Telangana Vaccination news

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారిలో లక్షకుపైగా సిబ్బందికి వాక్సినేషన్ పూర్తి కాగా... నేటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సైతం వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 50కి పైగా సిబ్బంది ఉన్న ఆస్పత్రుల్లో స్వయంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయగా అంతకన్నా తక్కువమంది ఉన్న ఆస్పత్రుల సిబ్బందికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా ఇవ్వనున్నారు.

సజావుగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ...  ఇక ప్రైవేటు వైద్య సిబ్బంది వంతు

author img

By

Published : Jan 25, 2021, 5:09 AM IST

Updated : Jan 25, 2021, 7:12 AM IST

సజావుగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ... ఇక ప్రైవేటు వైద్య సిబ్బంది వంతు

తొలి విడత వాక్సినేషన్‌లో భాగంగా గత వారం రోజులుగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చిన సర్కారు... నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వాక్సినేషన్ ప్రారంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 వేల ప్రైవేట్ ఆస్పత్రులుండగా వీటిలో సుమారు లక్షా 55 వేల మంది సిబ్బంది వ్యాక్సిన్ కోసం కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్నారు. వారందరికీ నేటి నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్కారు యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల్లో... సుమారు లక్షా పది వేల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొందరు మాత్రమే అతి స్వల్పంగా రియాక్షన్ బారిన పడ్డారు. ఆశించిన దానికన్నా వ్యాక్సిన్ రియాక్షన్ చాలా తక్కువగా ఉందని సర్కారు ప్రకటించింది.

నేటి నుంచి టీకా...

ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. 50 మందికన్నా అధికంగా వ్యాక్సిన్ తీసుకునే వారు ఉన్న ఆస్పత్రుల్లో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇక అంతకన్నా తక్కువ మంది ఉన్న దవాఖానాల సిబ్బందికి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా ఇవ్వనున్నారు.

నోడల్ అధికారి...

వాక్సినేషన్ కోసం ప్రతి ఆస్పత్రి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు సమాచారం ఇచ్చింది. 100 మంది కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకునే వారు ఉన్న దవాఖానాల్లో ఒకటి కంటే ఎక్కువ సెషన్‌సైట్లు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఫలితంగా రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోని సిబ్బందికి సైతం నేటి నుంచే వ్యాక్సిన్ అందనుంది.

బుధ, శనివారాల్లో బంద్...

ఇవాళ ఉదయం పది నుంచి 3 గంటల వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వాక్సినేషన్ కొనసాగనుంది. బుధ, శని వారాల్లో మాత్రం వాక్సినేషన్ నిర్వహించబోమని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజుల్లో హెల్త్‌కేర్ వర్కర్‌లకు పూర్తిస్థాయిలో వాక్సినేషన్ పూర్తి చేసే అవకాశం వున్నట్టు ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి: డ్యూటీలో నేరస్థుల వేట.. గ్రౌండ్​లో క్రికెట్ ఆట!

Last Updated : Jan 25, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.