జవహర్‌నగర్‌లోని 152 సర్వే నెంబర్‌లో 90 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని... ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. గత మార్చిలో ఆ భూమిని కొందరు స్థానికులు కబ్జా చేస్తున్నారని గ్రహించిన రెవెన్యూ అధికారులు... అక్కడికి వెళ్లి ఆపే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలో అధికారులపై కొంతమంది దాడులకు పాల్పడ్డారని అన్నారు.
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని రక్షించే ప్రయత్నం చేస్తున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. కనీసం ఇప్పటివరకు తాను ఆ భూమిని కూడా చూడలేదని ఎమ్మెల్యే తెలిపారు. అది ప్రభుత్వ భూమిగా 2011లోనే అధికారులు గుర్తించారని అన్నారు. కొంతమంది తనపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని... వారిపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టంగా మంటలు