పాత పద్ధతిలోనే పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు ఉపకులపతి ఛాంబర్‌ను ముట్టడించారు. ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. చెప్పులతో తమను తామే.. కొట్టుకుంటూ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.
అనంతరం విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెరిట్ ఆధారంగా పీహెచ్‌డీ.. నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు అతీతంగా మెరిట్ ఆధారంగా నిర్వహిస్తే పరిశోధనల మీద ఆసక్తితో ఎదురు చూస్తున్న విద్యార్థులు వాటికి దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: