ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ(Telangana News Telugu) రాష్ట్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ విజయంపై ప్రసంగించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ(FAO) నుంచి రాష్ట్రానికి ఆహ్వానం అందింది. ఈ నెల 4, 5 తేదీల్లో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై ఇటలీ రాజధాని రోమ్‌లో ఎఫ్‌ఏఓ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. ఇందులో ‘ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా: తెలంగాణ స్టేట్ యాజ్ ఏ గ్లోబల్ సీడ్ హబ్’ అనే అంశంపై ప్రసంగించేందుకు రాష్ట్రానికి ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రభుత్వం తరఫున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న మౌలిక వసతులు, విత్తన పరిశ్రమల సామర్థ్యం, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సీడ్‌బౌల్ కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. అన్ని దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ గుర్తింపు నేపథ్యాన్ని పురస్కరించుకుని కేశవులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు.
పోటెత్తిన ధాన్యం
ఇదిలాఉంటే... ఆరుగాలం కష్టించి పండించిన పంటను(Telangana News Telugu) కొనుగోలు చేయకపోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల అలసత్వం, ప్రణాళిక లోపం కారణంగా వందలాది మంది రైతులు ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు మిల్లర్లు కొనకపోవడం, మరోవైపు అధికారుల నిబంధనలు... ఇంతలోనే వర్షం ముంచుకు వచ్చి ధాన్యం తడుస్తుండడంతో ఓపిక నశించి అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మిర్యాలగూడలో చిన్నవి, పెద్దవి కలిపి 200 వరకు బియ్యం మిల్లులున్నాయి. వీటికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాల నుంచి రైతులు ధాన్యం తీసుకువస్తారు. సాధారణంగా దీపావళి తర్వాత మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తారు. ఈ దఫా బోర్లు, బావుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో ముందుగా నాట్లు వేశారు. దీపావళికి ముందే వరికోతలు కోసి మిల్లులకు తరలించారు. ప్రస్తుతం తక్కువ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతుండడం, రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో ధాన్యాన్ని(Telangana News Telugu) మిల్లులకు తీసుకురావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. సోమవారం చిరుజల్లులు పడడంతో ధాన్యం తడిసి, రంగు మారుతోంది. ఇదే అదనుగా మిల్లర్లు తక్కువ ధర చెల్లిస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాల్లో వరి కోతకు వస్తుంది. దీన్ని కూడా మిర్యాలగూడలో ఉన్న మిల్లులకే తరలించనున్నారు. అప్పుడు పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముంది. ఇప్పటి నుంచే అధికార యంత్రాంగం పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు అధికారులు, పోలీసులు టోకెన్‌లు పొందిన రైతులు మాత్రమే మిల్లులకు ధాన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టోకెన్లు ఉన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Road Accidents in Telangana : డిసెంబర్ వచ్చేస్తోంది.. వాహనదారులూ బీ కేర్‌ఫుల్!