ETV Bharat / state

సహాయక చర్యలను ముమ్మరం చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి - పైదరాబాద్‌ కాలనీల్లో కిషన్‌ రెడ్డి పర్యటన

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌లో జలమయమైన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

union minister  kishan reddy visiting at colonies in hyderabad
సహాయక చర్యలను ముమ్మరం చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
author img

By

Published : Oct 16, 2020, 9:29 AM IST

మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ నగరంలో జలమయమైన ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పలు కాలనీలు, బస్తీలు, ఇళ్లు నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులతో మాట్లాడారు. తార్నాక డివిజన్‌ లాలాపేట్‌లోని సత్య నగర్, ఇందిరా నగర్‌లో ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

స్థానికుల అవస్థలు

ఇళ్లలోకి నీరు చేరడంతో రెండు రోజులుగా తీవ్ర అవస్థలకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నాలాలు పొంగి... మురికి నీరు ఇళ్లలోకి వస్తుందని విచారించారు. పలు కాలనీల్లో అపార్ట్‌మెంట్‌లలోనూ నీరు చేరి బయటకు రాని పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు వాపోయారు.

చర్యలు వేగవంతం చేయాలి

వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. బాధితుల ఇళ్లలో నిలిచిన నీరు బయటకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి ఆహారం పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.

ఇదీ చదవండి: వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి.. సీఎంకు అధికారుల నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.