ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యమైంది: కిషన్​రెడ్డి

author img

By

Published : Mar 7, 2023, 10:38 PM IST

Kishan Reddy Fires on BRS : కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్​ఎస్​కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాను లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్‌ అండ్‌ టీ మధ్య ఒప్పందం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుందని ఆయన ఆరోపించారు. మద్యం వ్యాపారంలో కొత్త విధానం తెచ్చి ప్రజాసంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు.

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Fires on BRS : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి 12 అంశాలపై లేఖాస్త్రాలు సంధించారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్‌ పనులకు సహాకరించాలని... ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని కోరారు. సైనిక్‌ స్కూల్‌, సైన్స్‌ సిటీ కోసం భూమి కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. రైల్వేల పురోగతికి సహాకరించాలని లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల కోసం బీజేపీని విమర్శించండి.. కానీ పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు కేంద్రానికి సహాకరించాలని కోరారు.

కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్​ఎస్​కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్​కి చిత్తశుద్ధి ఉంటే తాను లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి కేంద్రం 1250 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమాకు మెట్రో డీపీఆర్‌ మంజూరయినట్టు వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్‌ అండ్‌ టీ మధ్య ఒప్పందం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుందని కిషన్​రెడ్డి ఆరోపించారు. ఫలక్‌నుమా వరకు రావాల్సిన మెట్రోను అఫ్జల్‌గంజ్‌ వద్దే ఆపారని... పాత నగరానికి మెట్రో రాకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు.

'ఎంఎంటీఎస్‌ రెండో విడతపై రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆలస్యం వల్ల ఎంఎంటీఎస్‌ రెండో విడత ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖకు జరిగిన ఒప్పందం పాటించట్లేదు. మెట్రో పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. రాష్ట్రంలో రైల్వేలపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.720 కోట్లు మంజూరు.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

కేసీఆర్​కు రిప్లై ఇచ్చే సంస్కారం లేదు : అబద్ధాలకు కేటీఆర్‌ మారుపేరని.. మసిపూసి మరేడుకాయ చేస్తారని కిషన్​రెడ్డి విమర్శించారు. దళిత విద్యార్థుల జాబితా కేంద్రానికి ఇవ్వకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇవ్వాల్సిన స్కాలర్‌ షిప్స్‌ అందకుండా చేస్తోందన్నారు. కేంద్రం పెండింగ్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలకు తిరిగి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. లేఖలు రాస్తే కేసీఆర్​కు రిప్లై ఇచ్చే సంస్కారంలేదని దుయ్యబట్టారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని.. గొంతుచించుకుంటే లాభం లేదన్నారు.

మద్యం వ్యాపారంలో కొత్త విధానం తెచ్చి ప్రజాసంపదను దోచుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టులపై స్పందించిన కిషన్‌రెడ్డి... ఈ విషయంలో భాజపా, ప్రధాని మోదీకి ఏం సబంధం అని ప్రశ్నించారు. ఎందుకు చాలా ఫోన్లు ధ్వంసం చేశారని ఈ విషయం విపక్ష నేతలకు తెలియట్లేదా అన్నారు.

'ప్రభుత్వ, ప్రజల సొమ్మును దోపిడి చేశారు. దీంతో మాకేం సంబంధం? ప్రజాసంపదను దోపిడీ చేసిన వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ, నరేంద్రమోదీకి ఏం సంబంధం? ఎందుకు అన్ని ఫోన్లు ధ్వంసం చేశారు. రోజుకో ఫోన్‌ కొని ధ్వంసం చేయండి... రెండోరోజు మరో ఫోన్‌ ఉపయోగించండని, ప్రజాధనం దోపిడీ చేయమని నరేంద్రమోదీ చెప్పారా? విపక్ష నేతలు ఇవన్నీ తెలియకుండానే ప్రధానికి లేఖ రాస్తారా? ఇన్నిఫోన్లు ధ్వంసం చేసిన వారికి ముందుగా లేఖ రాయండి. కొత్త మద్యం విధానం తెచ్చి సంపదను లూటీ చేసిన వారికి లేఖ రాయండి. ఆ తర్వాత నరేంద్రమోదీ వద్దకు రండి.'-కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యమైంది: కిషన్​రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.