కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్ రెడ్డి - తెలంగాణ భాజపా వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ మద్దతు లేకుంటే తెరాస సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యేదని.... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కుమ్మక్కు రాజకీయాలతో మేయర్, ఉపమేయర్ పదవులను దక్కించుకున్నారని ఆక్షేపించారు.
కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్ రెడ్డి
తెరాస, ఎంఐఎం మధ్య పొత్తు ఉందని... తెరాసకు ఓటేసినా మజ్లిస్‌కు ఓటేసినట్టేనని గతంలోనే చెప్పామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలతోనే జీహెచ్ఎంసీ మేయర్, ఉపమేయర్ పదవులు దక్కించుకున్నాయని ఆక్షేపించారు.
గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడా సరైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి జీహెచ్ఎంసీని దిగజార్చారని ధ్వజమెత్తారు.