ETV Bharat / state

Kishan reddy on kcr: 'సమస్యే కానీ అంశాన్ని సమస్యగా మార్చారు' - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్‌ ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకు కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ నిందిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy on kcr) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒప్పందం చేసుకున్న ప్రకారం ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.

Kishan reddy comments on kcr,
కేసీఆర్​పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
author img

By

Published : Nov 22, 2021, 1:53 PM IST

Updated : Nov 22, 2021, 3:18 PM IST

హుజూరాబాద్​లో తెరాస ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే... సీఎం కేసీఆర్‌ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy press meet) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారన్న కిషన్‌రెడ్డి.... అబద్ధాల భవనం మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సకల జనులు సర్వస్వం త్యాగం చేస్తే తెలంగాణ ఆవిర్భవించిందన్న కేంద్రమంత్రి... దళితులు ముఖ్యమంత్రిగా పనికి రారా..? అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్​మీట్

'ప్రతి గింజా కొంటాం'

బాయిల్డ్ రైస్ తప్పా మిగతావి కొంటామని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. రైతులకు బాయిల్డ్ రైస్​కు ఎటువంటి సంభంధంలేదని... ధాన్యం పండించడం వరకే రైతుల బాధ్యత అని అన్నారు. వివాదం కానీ అంశాన్ని సమస్య చేశారన్న కిషన్ రెడ్డి (kishan reddy today news).. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ప్రతి గింజా కొంటామని ఆయన పునరుద్ఘాటించారు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని కేసీఆర్‌(cm kcr news) చెబుతున్నా... కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తే తప్పేంలేదన్న కిషన్‌రెడ్డి.. మరి మన రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.

పర్యాటక కేంద్రంగా పోచంపల్లి

ఉత్తమ పర్యాటక విజిటింగ్ గ్రామంగా భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామని కేంద్రమంత్రి తెలిపారు. యునెస్కో వెబ్​సైట్​లోనూ పొందుపరిచారని వెల్లడించారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చామని పేర్కొన్నారు. తన కృషి ఫలితంగా శ్రీరామ సర్క్యూట్​ను అయోధ్య నుంచి భద్రాచలం వరకు పొడిగించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆజాద్ కా అమృత్ మహాత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు.

ఎంఎంటీఎస్ రెండవ దశకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచిపోయాయి. అజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా దేశభక్తి పాటల పోటీలను నిర్వహిస్తాం. ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తాం. సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేస్తున్నాం. చిన్న పిల్లల జోల పాటల కార్యక్రమాన్ని నిర్వహించి బహుమతులు అందజేస్తాం. రాష్ట్రస్థాయిలోనూ బహుమతులు ఇస్తాం.

-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

'డబ్బులు పంచినా ఓటమే..'

హుజూరాబాద్ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు డబ్బులు పంచినా అధికార పార్టీ ఘోర పరాజయం పాలైందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ ఎన్నికల కోసమే తెరాస ప్లీనరీ ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సచివాలయం హుజూరాబాద్​లో ఉందా? అనేవిధంగా హడావుడి చేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో ఉండే... గ్రామాల వారీగా రెండున్నర నెలలు మానిటరింగ్ చేశారని అన్నారు.

ఇదీ చదవండి: three capitals withdrawn : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

Last Updated : Nov 22, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.