ETV Bharat / state

Live Painting: లైవ్​ పెయింటింగ్​తో మర్చిపోలేని జ్ఞాపకాలు - Live painting news

Live Painting: సంక్రాంతి వచ్చిదంటే చాలు... శిల్పారామంలో సందడే వేరు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు జరుగుతాయి. పండుగ వేళ మధురానుభూతులు పంచడంతో పాటు... లైవ్‌ పెయింటింగ్‌తో మరిచిపోలేని జ్ఞాపకాలనూ మిగులుస్తోంది శిల్పారామం. సందర్శకులను కూర్చొబెట్టి గీసే స్వీయ చిత్రాలు ప్రత్యేకంగా నిలిచిపోతున్నాయి.

Painting
Painting
author img

By

Published : Jan 16, 2022, 5:29 AM IST

Updated : Jan 16, 2022, 6:09 AM IST

లైవ్​ పెయింటింగ్​తో మర్చిపోలేని జ్ఞాపకాలు

Live Painting: భాగ్యనగరంలో శిల్పారామం ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. నగరవాసులకు పల్లె పరిమళాలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంక్రాంతి వేళ జరిగే వేడుకలతో మరింత సందడి నెలకొంటుంది. సాధారణ సమయాల్లో శని, ఆదివారాల్లో సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ వేడుకలతోపాటు... శిల్పారామానికి వచ్చే పర్యాటకులకు లైవ్‌ పెయింటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. సందర్శకులను కూర్చొబెట్టి అచ్చం ఫొటో దిగినట్లుగానే గీస్తున్న చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి.

మధుర జ్ఞాపకం...

ఫొటోలు ఎన్నోసార్లు దిగుతుంటామని... లైవ్‌లో చిత్రం గీయించుకోవడం చాలా ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. బయట ఎన్ని ఫొటోలు దిగినా రాని ఆనందం ఇక్కడ బొమ్మ గీయించుకోవడం వల్ల కలుగుతోందని అంటున్నారు. ఈ చిత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెబుతున్నారు.

స్వయం ఉపాధి...

శిల్పారామంలో 20 మంది చిత్రకళాకారులు స్వయం ఉపాధి పొందున్నారు. గత 10 నుంచి 15 ఏళ్లుగా ఇక్కడే చిత్రాలు గీస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు వారు చెబుతున్నారు. శని, ఆదివారాల్లోనూ, పండుగ సమయంలో బాగా ఆదాయం వస్తుందని, మిగిలిన రోజుల్లో తక్కువ ఉంటుందని చెబుతున్నారు. లైవ్‌ పెయింటింగ్‌తో పాటు మెహందీ కూడా సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేతులకు అందమైన రూపాల్లో మెహందీ వేస్తూ... పలువురు జీవనోపాధి పొందుతున్నారు.

ఇదీచూడండి:

Last Updated : Jan 16, 2022, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.