ETV Bharat / state

విద్యుత్​ కాంతులతో ముస్తాబైన మహంకాళి ఆలయం - ujjaini temple

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల ఉత్సవాలకు  ముస్తాబైంది. రంగురంగుల దీపాలతో ఆలయప్రాంగణం సర్వాంగసుందరంగా సిద్ధమైంది.

విద్యుత్​ కాంతులతో ముస్తాబైన మహంకాళి ఆలయం
author img

By

Published : Jul 20, 2019, 4:15 AM IST

ఆషాడంలో జరిగే బోనాల పండగకు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దేవాలయం దేదీప్యమైన వెలుగులతో శోభను సంతరించుకుంది. ఆలయం అంతటా విద్యుత్ కాంతులు విరజిల్లుతున్నాయి. మహంకాళి ఆలయం పరిసరప్రాంతాలు రంగురంగుల దీపాలతో చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఆలయ ముఖద్వారాన్ని సుందరంగా అలంకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యుత్​ కాంతులతో ముస్తాబైన మహంకాళి ఆలయం

ఇదీ చూడండి:అతిథి గృహంలోనూ ధర్నాకు దిగిన ప్రియాంక

సికింద్రాబాద్ యాంకర్ ..ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనాల ఉత్సవాలకు మహంకాళి ఆలయం ముస్తాబవుతుంది ..దేదీప్యమైన వెలుగులతో ఆలయ ప్రాంగణమంతా మెరిసిపోతుంది..రకరకాల విద్యుద్దీపాలతో ఆలయం శోభను సంతరించుకుంది .తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన అనంతరం అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేపడుతోంది.మహంకాళి అమ్మవారి ఆర్చ్ ను లైటింగ్ తో సుందరంగా అలంకరించారు..ఆలయ ప్రాంగణం మొదటి భాగం నుండి ఆలయం చుట్టూరా రకరకాల రంగుల కాంతులతో విరజిమ్ముతోంది..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను లైటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఇక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ చూపరులను ఆకట్టుకుంటుంది.రాత్రి సమయాల్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాలుగా విద్యుత్ పరమైన చర్యలు చేపట్టారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.