ETV Bharat / state

వరల్డ్ రికార్డ్.. లోగో చూసి బ్రాండ్​ చెప్పాడు ఈ బుడతడు.. - hyderabad wonder kid

రెండేళ్ల ఎనిమిది నెలల వయసులోనే ఆరు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడో బుడతడు. 90 రకాల కార్ల లోగోలను చూసి ఆ సంస్థ పేరు చెప్పేయడం మనోడి ప్రత్యేకత. ఏ నుంచి జడ్ వరకు కార్ల బ్రాండ్ల పేర్లు చెప్తూ ఫిదా చేశాడు.

wonder kid
author img

By

Published : Oct 6, 2019, 1:17 PM IST

ఆ బాలుడి వయసు... రెండేళ్ల ఎనిమిది నెలలు. తన అద్భుత జ్ఞాపకశక్తితో 90 రకాల కార్ల లోగోలను చూసి సంస్థల పేరు ఇట్టే చెప్పేస్తాడు. ఏ నుంచి జడ్ వరకు కార్ల బ్రాండ్ల పేర్లు చెప్తూ అందరిని అబ్బురపరిచాడు. అతనే కొంపల్లికి చెందిన మాస్టర్ బి.షంశ్రీతాన్ష్ కార్తికేయ. దీన్ని అరుదైన రికార్డుగా పేర్కొంటూ... ఆరు ప్రపంచ రికార్డు సంస్థలు ధ్రువపత్రాలు అందజేశాయి. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ప్రతిభను ప్రదర్శించాడు.

నర్సరీ చదువుతున్న షంశ్రీతాన్ష్... పార్కింగ్ స్థలంలో ఉండే కార్ల లోగోలు, బ్రాండ్ పేర్లను నేర్పించినట్లు తల్లిదండ్రులు వంశీకృష్ణ, అనుపమ వివరించారు. ఈ ప్రతిభను భారత్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు వరల్డ్ రికార్డ్స్, తెలంగాణ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్ట్స్​లలో ప్రపంచ రికార్డులుగా నమోదు చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, దైవజ్ఞశర్మ చేతుల మీదుగా రికార్డులను అందజేశారు.

వరల్డ్ రికార్డ్.. లోగో చూసి బ్రాండ్​ చెప్పాడు ఈ బుడతడు

ఇదీ చూడండి: పెద్దాయన రికార్డ్... 50 ఏళ్లలో 3వేల వివాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.