చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న ఓ వాహనదారుడు కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నాగర్ కర్నూలు జిల్లా రామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన యాదగిరి అని... చైతన్యపురి పరిధిలో మూడు కేసులు సహా, నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో 19 కేసులు వెలుగులోకి వచ్చాయి.
యాదగిరి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువచేసే 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన యాదగిరి జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నేర చరిత్ర గురించి మొత్తం విచారణ జరిపిన అనంతరం అతడిపై పీడీయాక్ట్ కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్