ETV Bharat / state

ఇన్​స్టిట్యూట్​కి బయలుదేరిన ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం - ఇన్​స్టిట్యూట్​కి బయలుదేరిన ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం

ఇద్దరు అమ్మాయిలు రోజూలాగే హాస్టల్​ నుంచి ఇన్​స్టిట్యూట్​కు బయలుదేరారు. కానీ... శిక్షణా కేంద్రానికి మాత్రం చేరుకోలేదు. చాలాసేపు వేచి చూసిన తర్వాత... దారివెంట వెతికారు. అయినా లాభం లేదు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా... అదృశ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

TWO GIRLS MISSING AT SECUNDRABAD WHILE GOING TO YASHODHA INSTITUTE

author img

By

Published : Jan 31, 2020, 6:30 AM IST

Updated : Jan 31, 2020, 7:18 AM IST

ఇన్​స్టిట్యూట్​కి బయలుదేరిన ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం
హాస్టల్​ నుంచి ఇన్​స్టిట్యూట్​కు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​ మారేడ్​పల్లిలో చోటుచేసుకుంది. హయత్​నగర్ బాస్కో ప్రేమ్ సేవాసదన్ అనాథ ఆశ్రమం తరఫున 3 నెలల శిక్షణ నిమిత్తం గ్లోరి, కీర్తన... సికింద్రాబాద్​లోని హాస్టల్​లో చేరారు. రోజులాగే ఇద్దరు బాలికలు ఫౌండేషన్​కు బయలుదేరారు. వీరితో పాటు హాస్టల్​ వార్డెన్​ లక్ష్మి కూడా ఇన్​స్టిట్యూట్​కు బయలుదేరినట్లు సమాచారం.

ఎంతసేపటికి ఇన్​స్టిట్యూట్​కు ఇద్దరు అమ్మాయిలు రాకపోవటాన్ని గమనించిన నిర్వాహకులు హాస్టల్​కు సమాచారమిచ్చారు. మొదట హాస్టల్లో వెతికిన నిర్వాహకులు... రోజూ వచ్చే దారివెంట వెతికినా ప్రయోజనం కన్పించలేదు. వెంటనే మారేడ్​పల్లి పోలీసులకు సమాచారమివ్వగా... అదృశ్యం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం కోసం యశోద ఫౌండేషన్​లో శిక్షణ తీసుకునేందుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి:సమత కేసులో ప్రత్యేక కోర్టు తుది తీర్పు... దోషులు ముగ్గురికి మరణ శిక్ష

Last Updated : Jan 31, 2020, 7:18 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.