ETV Bharat / state

Jagga reddy: జగ్గారెడ్డికి ఊరట.. కేసులు కొట్టేసిన ప్రజాప్రతినిధుల కోర్టు - జగ్గారెడ్డిపై కేసుల కొట్టివేత

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊరట లభించింది. ఆయనపై నమోదైన రెండు కేసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట, సదాశివపేట పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో ఆధారాలు లేవని తెలిపింది.

two cases dismissed
జగ్గారెడ్డికి ఊరట
author img

By

Published : Oct 8, 2021, 5:43 AM IST

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఉన్న రెండు కేసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట, సదాశివపేట పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో ఆధారాలు లేవని వెల్లడించింది. గతంలో రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారని పంజాగుట్ట పీఎస్​లో ఓ కేసు నమోదైంది. అలాగే అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారని సదాశివపేట పోలీస్ స్టేషన్​లో నమోదైన కేసులను విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది.

హెరిటేజ్​కేసు ఈనెల 20కి వాయిదా

హెరిటేజ్ పరువు నష్టం కేసు విచారణ జరిగింది. ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై ఎన్​బీడబ్ల్యూ రీకాల్ పిటిషన్ వేసేందుకు కొంత గడువు కావాలని న్యాయవాదులు కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఈనెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదీ చూడండి: Teenmaar Mallanna: ఎడవల్లి పోలీసుల కస్టడీలో తీన్మార్ మల్లన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.