రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను చూసి భారతదేశంలోని ప్రజా వ్యతిరేకులు సైతం భయపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్-82 ద్వితీయ డైరీ, క్యాలెండర్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
రెండు మూడు నెలల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెప్పవాలకుండా విద్యుత్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు గొప్ప గౌరవంతో బతుకుతున్నారని ఆయన కొనియాడారు.
ఇదీ చూడండి: మహా అద్భుతం... కాళేశ్వరంతో బీళ్లు సస్యశ్యామలం