తెరాస పాలనలో మహిళా రక్షణ గాలిలో దీపంలా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇవాళ గవర్నర్ తమళి సై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నఅఘాయిత్యాలు, రైతాంగ సమస్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, రైతుల ఆత్మహత్యలు, పేదలకు భూ పంపిణీ తదితర అంశాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెతెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల ఘటన తర్వాత సైతం ప్రభుత్వంలో ఎలాంటి మార్పుల రాలేదని తెతెదేపా మహిళ విభాగం నేత జోత్స్న ఆక్షేపించారు. తక్షణమే రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి సిరిసిల్ల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు ఆమె తెలిపారు.
ఇవీ చూడండి:'న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించాలి'