ETV Bharat / state

రూ.3,309 కోట్ల బడ్జెట్​కు తితిదే బోర్డు ఆమోదం - TTD budjet 2020 -21 budjet

2020-21 బడ్జెట్​కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆమోదం తెలిపింది. బడ్జెట్​ రూ.3,309 కోట్లుగా అంచనా వేసింది. బూందీపోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ.3.3 కోట్లు కేటాయించినట్లు తితిదే ఛైర్మన్​ సుబ్బారెడ్డి వెల్లడించారు. జమ్ము, ముంబయి, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ttd Approval to budjet-2020-21
బడ్జెట్​కు తితిదే బోర్డు ఆమోదం
author img

By

Published : Feb 29, 2020, 5:55 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 2020-21 బడ్జెట్​ను ఆమోదించింది. బడ్జెట్ రూ.3,309 కోట్లుగా అంచనా వేసింది. బూందీపోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ.3.3 కోట్లు కేటాయించినట్లు తితిదే ఛైర్మన్​ సుబ్బారెడ్డి వెల్లడించారు. బర్డ్ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల కోసం రూ.8.5 కోట్లు కేటాయించారు. బర్డ్ ఆస్పత్రిలో కొత్త ఉద్యోగాల భర్తీకి పాలకమండలి అనుమతించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ.3.92 కోట్లు కేటాయించారు. తితిదేలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. తితిదే ఆలయాల్లో భద్రతకు 1300 సీసీ కెమెరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు.

జమ్మూ, ముంబయి, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ద్విచక్రవాహనాలు మినహా మిగతా వాటికి అలిపిరి వద్ద టోల్‌ రుసుం పెంచారు. లైట్ మెట్రోపై నిపుణుల ప్రతిపాదనలు వచ్చాకే నిర్ణయం తీసుకోనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీ జూపార్కు వద్ద ప్రతిభావంతుల శిక్షణా వసతి గృహానికి రూ.14 కోట్లు కేటాయించారు. శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఎ.కె.సింఘాల్ విడుదల చేశారు.

బడ్జెట్​కు తితిదే బోర్డు ఆమోదం

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.