తెలంగాణ ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హరియాణా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. 48 వేల మంది కార్మికులను తీసివేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. భివానీలో తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తేనే ప్రజలకు మంచి సౌకర్యాలు లభిస్తాయని వారు సూచించారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం సరికాదన్నారు.
తెలంగాణ సర్కార్ది హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి వల్లే ఇద్దరు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మ బలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 48 వేల మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మాహుతికి పాల్పడ్డ ఉద్యోగులను అమరవీరులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి : పట్టువీడని ఆర్టీసీ కార్మికులు.. 16వ రోజుకు సమ్మె