మంత్రి మండలి సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడిన విధానం పూర్తిగా ఆక్షేపణీయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తీవ్రంగా తిట్టడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కేంద్రంపై నింద మోపి సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతం అవ్వడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెగేదాకా లాగకుండా చివరికి శుభం పలికారన్నారు.
కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా యథావిధిగా ఉద్యోగాల్లో చేరమని... చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినందుకు పలువు నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది