ETV Bharat / state

TSRTC Special Buses: మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TSRTC Special Buses: మహాశివరాత్రి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి మార్చి 4వ తారీఖు వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

TSRTC
TSRTC
author img

By

Published : Feb 26, 2022, 7:25 PM IST

TSRTC Special Buses: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు.

ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు, తార్నాక, రెజిమెంటల్ బజార్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఘట్కేసర్, వెంకటాపురం, అల్వాల్, అమ్ముగూడ, బాలానగర్ క్రాస్ రోడ్డు, మియాపూర్ క్రాస్ రోడ్, పటాన్ చెరువులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. 30 మందితో కూడిన భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే తమ నివాసానికి సమీప ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

గత కొన్ని రోజుల క్రితం ముగిసిన సమ్మక్క- సారక్క జాతరకు సైతం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఎండీ సజ్జనార్ నేతృత్వంలో 60 మంది అధికారుల బృందం మేడారం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ వద్దే బస చేసి ఆర్టీసీ సేవలను పర్యవేక్షించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 4 వేల బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఇందుకోసం 12,500 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు.

ఇదీ చూడండి: Medaram Jatara 2022: మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు అదరహో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.