దసరా పండుగకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను(TSRTC Dasara special buses) ఏర్పాటు చేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌలభ్యం కోసం వారి కాలనీలకు బస్సులు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే ప్రాంతం లేదా కాలనీలోని 30 మంది ప్రయాణికులు దగ్గరిలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకుంటే బుధవారం నుంచి ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. దసరా ప్రత్యేక బస్సులు, టికెట్ ధరలు, సమయాల సమాచారం కోసం ఎంజీబీఎస్ (ఫోన్ నం.99592 26257), జూబ్లీ బస్‌స్టేషన్ (99592 26264), రెతిఫైల్ బస్‌స్టేషన్ (99592 26154), కోఠి బస్‌స్టేషన్ (99592 26160) సమాచార కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఇవి 24 గంటలూ పనిచేస్తాయన్నారు. సాధారణ ప్రజలతో పాటు కార్మికులు, వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. దసరాకు(dasara festival in 2021) హైదరాబాద్ నలుమూలల నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్పెషల్ బస్సులు
దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 4,035 ప్రత్యేక బస్సులు(TSRTC Dasara special buses) ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. మంగళవారం ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఎక్కడి నుంచి.. ఏయే ప్రాంతాలకు బస్సులు
1. ఎంజీబీఎస్..: గరుడ, గరుడప్లస్‌తో పాటు బెంగళూరు, ఖమ్మం వైపు వెళ్లే అన్ని బస్సులు, శ్రీశైలం, కల్వకుర్తి, రాయచూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, పెబ్బేరు, కొత్తకోట, జోగులాంబ గద్వాల, మెదక్, బాన్సువాడ, బోధన్, జహీరాబాద్, బీదర్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి, నాగ్‌పూర్, అమరావతి, నాందేడ్, అకోల(మహారాష్ట్ర), దేవరకొండ, పరిగి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు వెళ్లే బస్సులు బయలుదేరుతాయి.
2. జేబీఎస్..: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు వెళ్లే అన్ని బస్సులు
3. ఉప్పల్ క్రాస్‌రోడ్డు..: యాదగిరిగుట్ట, పరకాల, జనగాం, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ వైపు వెళ్లే బస్సులు
4. దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్..: మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు
5. సీబీఎస్..: కర్నూలు వైపు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, మదనపల్లికి వెళ్లే బస్సులు బయలుదేరుతాయి.
* ప్రయాణికుల సౌకర్యార్థం విచారణ కేంద్రం ఫోన్ నంబర్లు ఎంజీబీఎస్- 99592 26257, జేబీఎస్-040-27802203, ఆర్టీసీ అధీకృత ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.
ఇదీ చదవండి: engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ