ETV Bharat / state

ఉచిత ప్రయాణ సౌకర్యం అమలుతీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆకస్మిక తనిఖీ - Free travel for women in Telangana

TSRTC MD Sajjanar inspects on Mahalakshmi Scheme : మహిళలకు ఉచిత ప్రయాణసౌకర్యం అమలు తీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సులను, బాన్సువాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. పథకం అమలవుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Freebus Service in Telangana
TSRTC MD Sajjanar inspects on Mahalakshmi Scheme
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 6:58 PM IST

TSRTC MD Sajjanar inspects on Mahalakshmi Scheme : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌(MD Sajjanar) క్షేత్ర పరిశీలన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడి పథకం అమలు అవుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ పుంజుకుంటుంది : సజ్జనార్

అనంతరం జేబీఎస్- వెంకట్‌రెడ్డి నగర్ (రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ జీరో టికెట్‌ను అందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

  • *జేబీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (@SajjanarVC), IPS

    *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలుపై క్షేత్ర పరిశీలన

    హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు… pic.twitter.com/Ppk3uWulju

    — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Freebus Service in Telangana : మహిళలకు ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ మహాలక్ష్మి పథకాన్ని(Mahakakshmi Scheme) మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్సాన్స్‌జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.

కిక్కిరిసిన నిర్మల్​ బస్టాండ్​ - సీటు కోసం డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి వాటిపై 40 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి సంస్థకు సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఉచిత ప్రయాణ సౌకర్యం పథకం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించామని సజ్జనార్‌ తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సంయమనం పాటించి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పథకం అమలులో ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదులకై 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్‌ 040-69440000, 040-23450033 ఫోన్ చేసి చెప్పాలన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్​రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.