ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. లాక్డౌన్ ముందు నిత్యం బస్సులు రద్దీగా ఉండేవి. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పొరుగూరు వెళ్లేందుకు సైతం భయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఆర్టీసీ రంగంపై దారుణంగా ఉంది. ఆదాయ, వ్యయాల పరిస్థితులు తారుమారయ్యాయని ఆర్టీసీ ఈడీ యాదగిరి రావు అన్నారు. ఈ సమయంలో సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు, బస్సుల కండిషన్, ప్రయాణికులకు ఇస్తున్న సేవల గురించి ఆర్టీసీ ఈడీ యాదగిరి రావు ఈటీవీ భారత్తో ముచ్చటించారు.
ఇవీ చూడండి: కొవిడ్ బారిన తితిదే ఉద్యోగులు.. అప్రమత్తమైన అధికారులు