TSRTC Special Package for Srisailam Passengers : హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. మొదటి రోజు జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుందని తెలిపింది. అనంతరం విశ్రాంతి కోసం హోటల్‌కి తీసుకెళ్తారు.
Full Details of TSRTC Special Pakage : మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో భోజన సదుపాయం ఉంటుంది. తరవాత రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చని పేర్కొంది. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్ అవుట్ చేయాలి. అక్కడి నుంచి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, శివాజి స్పూర్తి కేంద్రం సందర్శన ఉంటుందని వెల్లడించింది.
-
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని #TSRTC ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా… pic.twitter.com/pXhI36MPXa
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని #TSRTC ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా… pic.twitter.com/pXhI36MPXa
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 19, 2023ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని #TSRTC ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా… pic.twitter.com/pXhI36MPXa
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 19, 2023
TSRTC Srisilam Tour Special Pakage : సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పంచధార, పాలధార, శ్రీశైలం డ్యాం, శిఖరం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. వసతి, రవాణా, శిఖరం ప్రవేశ రుసుం, ఆలయ శీఘ్ర దర్శనం ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలని ఆర్టీసీ తెలిపింది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తున్నందున ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది.
టికెట్లలను ఎలా బుక్ చేసుకోవాలి : హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలని యాజమాన్యం కోరింది. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ tsrtconline.inలోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌లు ప్రకటించారు.
ఇవీ చదవండి :