TSRTC Special Offer: పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాల కోసం అద్దెకు తీసుకునే బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పించాలని సంస్థ నిర్ణయించింది. అన్ని రకాల బస్ సర్వీసులపై 10 శాతం రాయితీ అందజేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇది ఈ ఏడాది జూన్ 30 వరకు అమల్లో ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది.
కార్తీక మాసం, వన భోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావడంతో మరోసారి ప్రకటించింది. వివాహాలు ఎక్కువ ఈ మాసంలో జరగనున్నందున.. రాయితీ ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు రాయితీని సంస్థ ప్రకటించింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే.. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు.
అద్దె బస్సుల బుకింగ్ కోసం ఆర్టీసీ సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.inను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలన్నారు.ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా పలు చర్యలు తీసుకుంటోంది. చిన్నారులకు, విద్యార్థులకు, గర్భిణీలకు ఇలా పలు రకాలుగా రాయితీలను అందిస్తోంది. తాజాగా మరోమారు ప్రత్యేక రాయితీ ప్రకటించింది.
ఇదీ చదవండి : ఈ నెలాఖరులో పోడుభూముల పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటన
రాజస్థాన్ అసెంబ్లీలో హైడ్రామా... పాత బడ్జెట్ను చదివిన సీఎం అశోక్ గహ్లోత్!