ETV Bharat / state

TSRTC AC Electric Buses Launch Today : హైదరాబాద్​లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్​రయ్

TSRTC AC Electric Buses Launch Today in Hyderabad : హైదరాబాద్ నగ‌ర‌వాసుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. నేటి నుంచి ఈ బ‌స్సులు న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్నాయి. కాలుష్య నివారణతో పాటు ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అధికారులు తెలిపారు.

AC Electric Buses
TSRTC AC Electric Buses Launch Today
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 8:46 AM IST

Updated : Sep 20, 2023, 12:06 PM IST

TSRTC AC Electric Buses Launch Today హైదరాబాద్​లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్​రయ్

TSRTC AC Electric Buses Launch Today in Hyderabad : హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బ‌స్సుల‌ను పెంచే దిశగా టీఎస్ఆర్టీసీ క‌స‌ర‌త్తు చేస్తోంది. న‌గ‌ర‌వాసుల సౌకర్యార్థం గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. నేటి నుంచి ఈ బ‌స్సులు న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్నాయి. ఈ బ‌స్సుల్ని ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ గ‌చ్చిబౌలి స్టేడియం ద‌గ్గర ప్రారంభించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌ రెడ్డి, వీసీ అండ్ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా పాల్గొంటారు.

Telangana AC Electric Buses in Hyderabad : ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్య నివారణతో పాటు ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించ‌నున్నాయ‌ని ఆర్టీసి యాజమాన్యం భావిస్తోంది. మొత్తం 50 గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ స‌ర్వీసుల్లో మొద‌టి విడ‌త‌గా 25 బ‌స్సులు అందుబాటులోకి వస్తున్నాయి. మిగిలిన 25 బ‌స్సులు న‌వంబ‌రు నాటికి అందుబాటులోకి రాగ‌ల‌వ‌ని టీఎస్ఆర్టీసీ ప్రక‌టించింది.

TSRTC Electric Bus : ఆగస్టు నెలాఖరు నాటికి భాగ్యనగర రోడ్లపై మరో 25 ఈవీ బస్సుల రయ్​.. రయ్​.. ఈ విషయాలు తెలుసుకోండి

గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ప్రత్యేకతలు ఇవే..

  • ఎలక్ట్రిక్ బ‌స్సులు వంద శాతం వాయు కాలుష్యాన్ని వెద‌జ‌ల్ల‌వు.
  • ఈ బస్సులకు ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తాయి.
  • 3 గంట‌ల‌ నుంచి 4గంటలలోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవుతుంది.
  • క్యాబిన్, సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ స‌దుపాయాలు క‌లిగి ఉన్నాయి.
  • ఈ గ్రీన్ లగ్జ‌రీ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు, అత్యాధునిక సౌక‌ర్యాల‌తో టి.ఎస్‌.ఆర్టీసీ అందుబాటులోకి తెస్తున్నాయి.
  • ఈ బస్సుల్లో 35 సీట్ల సామర్థ్యం కలదు.
  • ప్రయాణికులకు కోసం మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్ ల్యాంప్​లను ఏర్పాటు చేశారు.

AC Electric Buses Launch in Hyderabad Today : ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం ఉంది. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్​కు అనుసంధానం చేస్తారు. ఈ బస్సుల్లో రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉండేలా చేశారు. ఈ బస్సుల్లో రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరాలను అమర్చారు. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. ఈ బస్సులో ఫైర్‌ డిటెక్షన్‌ సంప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ఇది ముందుగానే అగ్నిప్రమాదాలను గుర్తించి నివారించేందుకు సహాయపడుతుంది. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టంను ఏర్పాటు చేశారు.

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

Telangana RTC Merge in Government : ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం.. ఇక క్యాడర్‌ ఫిక్సేషన్‌ తేలాలి..!

Last Updated : Sep 20, 2023, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.