ETV Bharat / state

ఈ ఆదివారం 10 నిమిషాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేశారంటే?

author img

By

Published : May 17, 2020, 4:25 PM IST

Updated : May 17, 2020, 5:17 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ప్రతి ఆదివారం -10 గంటలకు 10 నిమిషాలు' అంటూ మంత్రి కేటీఆర్​ గత ఆదివారం పిలుపునిచ్చారు. ఇవాళ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ts-ministers-and-mls-participated-every-sunday-10-o-clock-10-minutes-programme-in-telangana
ఈ ఆదివారం - 10 నిమిషాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేశారంటే?

ప్రతి ఆదివారం - పది నిమిషాలు అంటూ మంత్రి కేటీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, తదితర అధికారులు నడుంబిగించారు. ఈ ఆదివారం సైతం పది గంటలకు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి... హైదరాబాద్​లోని తన నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాల పరిశుభ్రం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటిని తొలగించారు.

బోయిన్​పల్లిలో మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్ర పరిచారు.

  • 10గంటలకు పది నిమిషాలు 2వ ఆదివారం కార్యక్రమంలో భాగంగా స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది. నిలువ ఉన్న నీటిని తొలగించడం జరిగింది.@KTRTRS#10AM10Minutes #Sunday pic.twitter.com/3LNpflPerk

    — Chamakura Malla Reddy (@chmallareddyMLA) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంజారాహిల్స్​లోని శ్రీరామ్​నగర్​ కాలనీలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఆకస్మికంగా పర్యటించారు. మంత్రి కేటీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటికీ తిరిగి డెంగీ దోమలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. దోమలు దరి చేరే ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిని మంత్రి స్వయంగా పరిశీలించి.. తొలగించారు.

మరోవైపు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Last Updated : May 17, 2020, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.