ETV Bharat / state

'బుల్లెట్ రైలు అంటే దిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్‌ గుర్తుకు రాదా' - మంత్రి కేటీఆర్

కేంద్రంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. పారిశ్రామికీకరణ విషయంలో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని  ఆరోపించారు.  పెద్ద పరిశ్రమలకు హైదరాబాద్ గుర్తుకు రాదా అని టీఎస్​ఐపాస్ వార్షికోత్సవ వేడుకల్లో ప్రశ్నించారు.

ts-ipass 5th anniversery in hyderabad
'బుల్లెట్ రైలు అంటే దిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్‌ గుర్తుకు రాదా'
author img

By

Published : Dec 4, 2019, 3:27 PM IST

'బుల్లెట్ రైలు అంటే దిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్‌ గుర్తుకు రాదా'

హైదరాబాద్‌ మాదాపూర్‌ శిల్పకళావేదికలో టీఎస్‌ఐపాస్‌ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి హాజరయ్యారు. పారిశ్రామిక రంగంలో ముందున్న, ప్రగతికి కృషిచేసిన జిల్లాలకు 3 విభాగాల్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పురస్కారాలు అందజేశారు.

టీఎస్​ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ కోసం గతంలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని... ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారమని... మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంటే... ఎంఎస్ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు.

భూములను దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటాం

హైదరాబాద్‌లో ఫార్మాసిటీని అతిత్వరలోనే ప్రారంభించబోతున్నామన్నారు. సులభతర వాణిజ్యంలో అగ్రభాగాన ఉండటంతో పాటు... ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే భూమిని సద్వినియోగం చేసుకోవాలని... గతంలో జరిగిన భూకేటాయింపులను మరోసారి సమీక్షిస్తామని తెలిపారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను దుర్వినియోగం చేస్తే వెనక్కి తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వైట్, పింక్, గ్రీన్, బ్లూ రెవల్యూషన్లలో తెలంగాణ అగ్రభాగాన నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయెుద్దు...

చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని... రాజకీయ కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవట్లేదని కేటీఆర్ మండిపడ్డారు. పనిచేస్తున్న రాష్ట్రాలకు తోడ్పడాలి, ప్రోత్సహించాలనే ధోరణి కేంద్రానికి లేదని ఆరోపించారు. బుల్లెట్ రైలు అంటే దిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్‌ గుర్తుకు రాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే కేంద్రానికి హైదరాబాద్‌ ఎందుకు గుర్తురాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ​ రంగంలో హైదరాబాద్ ప్రస్థానాన్ని మరచి... డిఫెన్స్ కారిడార్​ను హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కాకుండా వేరే చోట ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి విమర్శించారు. పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదని మంత్రి వెల్లడించారు.

ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.