ETV Bharat / state

అందరూ గాంధీకి వస్తే ప్రత్యేక ఆస్పత్రుల ప్రయోజనమేంటి..: హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లోని వైద్య సేవలు, సౌకర్యాలపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుకు హైకోర్టు ఆదేశించింది. చాలా వరకు జిల్లా ఆస్పత్రులకు వెళ్లినా.. గాంధీ ఆస్పత్రికి వెళ్లమంటున్నారని.. అలాంటప్పుడు జిల్లాల్లో కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించినా ప్రయోజనం ఏముందని ప్రశ్నించింది.

author img

By

Published : Jul 14, 2020, 4:52 AM IST

ts hc questions to government on covid hospitals in state
అందరూ గాంధీకి వస్తే ప్రత్యేక ఆస్పత్రుల ప్రయోజనమేంటి..: హైకోర్టు

బోధనాస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుకు హైకోర్టు ఆదేశించింది.

కరోనా విజృంభిస్తున్నా.. బోధనాస్పత్రులను వినియోగించుకోకపోవడాన్ని సవాల్​ చేస్తూ డా. ఆర్. శ్రీనివాసన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది... బోధనాస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. అయినా అందరూ గాంధీ ఆస్పత్రికి వస్తున్నారని, అక్కడ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల గేటు ముందే చనిపోతున్నారన్నారు. యాంటీ ర్యాపిడ్ కిట్లు గాంధీ ఆస్పత్రిలో అందుబాటులో లేవని వాదించారు.

పరీక్షలు నిర్వహించరు.. చికిత్సలు చేయరు

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చాలా వరకు జిల్లా ఆస్పత్రులకు వెళ్లినా.. గాంధీ ఆస్పత్రికి వెళ్లమంటున్నారని.. అలాంటప్పుడు జిల్లాల్లో కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించినా ప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. పరీక్షలు నిర్వహించరు.. చికిత్సలు చేయరని.. వాటివల్ల ఉపయోగం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆదిలాబాద్, వరంగల్ వంటి మారుమూల జిల్లాల నుంచి హైదరాబాద్​ రావాలంటే కష్టమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అమెరికాలో ఇంటికి రెండు కార్లుంటాయని, ఇక్కడ ద్విచక్రవాహనం లేనివారు కూడా ఉన్నారంది. ఇంట్లో 60 ఏళ్ల వ్యక్తికి కరోనా వస్తే హైదరాబాద్​కు ఎలా తీసుకురావాలని ప్రశ్నించింది. ఏఏ ఆస్పత్రుల్లో పరీక్షలు, చికిత్సలు అందుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సి ఉందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలను స్వయంగా వచ్చి వివరించాలంటూ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ ఉండాలి..

ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ ఉండాలని.. హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాలను కాకుండా లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడం ఏంటని నిలదీసింది. ప్రైవేటు ఆస్పత్రులను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవో అమలయ్యేలా చూడాలంటూ జే.వేణుధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఈ విషయం సర్కారుకు తెలిసినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. జీవోను అమలుచేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంపై కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 29కు వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.