తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో నడిచిన తనపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని టీఎస్ ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు. సీఎం, కేటీఆర్‌తో మంచి పేరు ఉందనే తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.
దావా వేస్తా..
కేసీఆర్‌తో కలిసి 2001 నుంచి క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేస్తున్నానని లింగంపల్లి తెలిపారు. ఈ నెల ఒకటిన తెలంగాణ భవన్‌కి సరోజ అనే మహిళను పంపి తనపై అసత్య ఆరోపణలు చేశారని వెల్లడించారు. దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు.
సరోజ కొడుకు శ్రావణ్‌కుమార్ నా వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఇంట్లో బంగారు గొలుసు దొంగిలించాడు. సైబర్ క్రైంలో కేసు అయిన తర్వాత గొలుసు బయటపడడంతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.
-లింగంపల్లి కిషన్ రావు
ఇదీ చూడండి: 'ఓటుకు నోటు కేసు అ.ని.శా. కోర్టు పరిధిలోకి రాదు'