TRS Rail Bhavan Protest: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెరాస డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద వివిధ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. ఇందులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. విభజన అంశాలను కేంద్రం విస్మరిస్తోందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని వినోద్ కుమార్ ఆరోపించారు.
'కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనకు సముఖం వ్యక్తం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో రైల్వే లైన్ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.'
-- వినోద్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!