Trs Plenary Meeting yerpatlu: తెరాస ప్లీనరీ సమావేశానికి హైదరాబాద్ ముస్తాబవుతుంది. నగరంలోని రహదారులు అన్నీ గులాబీమయంగా మారాయి. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ నేతృత్వంలో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పలుచోట్ల కటౌట్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. లిబర్టీ, గన్ పార్క్, బషీర్ బాగ్, అబిడ్స్ పరిసరాలతో పాటు పలు కూడళ్లలో గులాబీ జెండా తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లతో నింపేశారు.
రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చే తెరాస నాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ముడు వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతుండగా అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ సమావేశం జరిగే పరిసరాలు గులాబీమయం అయ్యాయి.
ఇదీ చదవండి: టిమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ శంకుస్థాపన.. ఏడాదిలోగా అందుబాటులోకి సేవలు