ETV Bharat / state

ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల భర్తీ... చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్ - ktr on employment in telangana

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు పూర్తి అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా శాఖల వారీ భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను కేటీఆర్ వెల్లడించారు. తెరాస అధికారం చేప్టట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో లక్షా 32 వేల 899 ఉద్యోగాలు కల్పించిందని.. వాటి జాబితాను శాఖల వారీగా మరోసారి వెల్లడిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి, గందరగోళానికి గురి చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు.

ఉద్యోగాల కల్పనలో చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్

author img

By

Published : Feb 25, 2021, 7:30 PM IST

జానారెడ్డి లాంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరమన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.

అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని తెరాస చెప్పినట్టు జానారెడ్డి.. ఈరోజు మీడియాతో అన్నారు. అవును ముమ్మాటికి జానారెడ్డి చెప్పింది నిజమే. ఇచ్చినమాట ప్రకారం మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నాం.

-- కేటీఆర్, మంత్రి

తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో త్వరలో చెప్తామన్న జానారెడ్డి... అందులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలని లేఖలో కేటీఆర్ కోరారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులతో పాటు ప్రతిపక్షాలు మీడియా ముఖంగా అవాస్తవాలు మాట్లాడుతున్నాయన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎండగట్టేలా తెరాస ప్రభుత్వం భర్తీ చేసిన లక్షా 32 వేల 899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నానని కేటీఆర్ వివరించారు.

సంబంధిత శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు

క్రమసంఖ్యశాఖభర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య
1.తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్30,594
2.తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్31,972
3.తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు3,623
4.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ- హైదరాబాద్179
5.శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ- హైదరాబాద్80
6. డైరెక్టర్, మైనార్టీస్ వెల్ఫేర్ 66
7.జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్9,355
8.డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయూశ్171
9.టీఎస్​ జెన్​కో856
10.టీఎస్ ​ఎన్పీడీసీఎల్164
11.టీఎస్​ ఎస్పీడీసీఎల్201
12.టీఎస్​ ట్రాన్స్​కో206
13.టీఎస్​ ఆర్​​టీసీ4,768
14.సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్12,500
15. జెన్​కో, ట్రాన్స్​కో, ఎన్పీడీసీఎల్, ఎస్​పీడీసీఎల్6,648
16.విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ22,637
17.హైదరాబాద్ జలమండలి 807
18.తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్243
19.డీసీసీబీలు1,571
20.భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు 6,258
మొత్తం ఉద్యోగాల సంఖ్య1,32,899

ప్రైవేట్​ రంగంలో 14 లక్షలు...

ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే... గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ఐపాస్ విధానం ద్వారా ప్రైవేట్​ రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను తెలంగాణ యువతకు కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పట్లో అవినీతి పబ్లిక్ సర్వీస్ కమిషన్​గా పేరుపొందిందని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

త్వరలో ఉద్యోగాల భర్తీ...

ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ అన్న మంత్రి... ఆమేరకు త్వరలో మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కేవలం కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి యువత లోనుకాకుండా ఆలోచించాలని కోరారు. ఉద్యోగాల కల్పన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిబద్ధత, చిత్తుశుద్ధితో పనిచేస్తున్న తెరాసకు యువత అండగా నిలవాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రానికి మరోసారి స్కోచ్‌ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.