తెరాస ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన నివాసంలో పార్టీ జెండా ఎగురవేశారు.
ఉద్యమ పార్టీగా మొదలై... రాష్ట్ర పార్టీగా అవతరించి... బంగారు తెలంగాణ సాధన దిశగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెరాస ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. రాష్ట్రంలో రెండోదశ కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అభివృద్ధి, సంక్షేమమే తెరాస లక్ష్యం: తలసాని