TRS MPs on Modi: ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెరాస ఎంపీ కేకే పేర్కొన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీ విభజనపై రాజ్యసభలో ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రివిలేజ్ నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్ చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభ బహిష్కరణకు తెరాస ఎంపీలు నిర్ణయించారు.
TRS MPs on Andhra Pradesh Bifurcation: ప్రధాని మోదీ కొత్త వివాదాలకు తెర తీస్తున్నారని ఎంపీ కేకే ఆరోపించారు. పార్లమెంటు ఘోర తప్పిదం చేసినట్లు ప్రధాని మాట్లాడారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని నియమాల ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామని తెలిపారు. భాజపా ప్రభుత్వమే ఇప్పుడు ఎన్నో నిబంధనలు ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడ్డారు. సభ ప్రొసీడింగ్స్‌ను ఏ కోర్టుల్లోనూ సవాలు చేయలేమని వెల్లడించారు. ఎనిమిదేళ్ల తర్వాత మోదీ అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ ప్రశ్నించే హక్కు మోదీకి లేదని చెప్పారు. సభను, తెలంగాణను ప్రధాని మోదీ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న తెలంగాణను అవమానించారని పేర్కొన్నారు.
8 ఏళ్ల క్రితం పార్లమెంట్ ఘోర తప్పిదం చేసినట్టు ప్రధాని మోదీ మాట్లాడారు. పార్లమెంట్ ద్వారానే మన దేశం నడుస్తోంది. ప్రధాని స్థాయిలో మోదీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొత్త వివాదాలకు మోదీ తెర తీస్తున్నారు. పార్లమెంట్ ప్రొసీడింగ్ చూసేది రాష్ట్రపతి, మొత్తం సభ. సభలో ఏది జరిగినా సభ్యులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారు. రాజ్యాంగంలోని నియమాల ప్రకారమే సభ నడుస్తుంది. పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను న్యాయస్థానంలో కూడా సవాల్ చేయలేం. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చాం. సభ ప్రొసీజర్స్‌ను, ప్రొసీడింగ్స్‌ను మోదీ సవాల్ చేస్తున్నారు. పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను ప్రశ్నించే హక్కు మోదీకి లేదు. 8ఏళ్ల తర్వాత సభలోని అంశాలపై అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరం. భాజపా ప్రభుత్వమే ఇప్పుడు ఎన్నో నిబంధనలు ఉల్లంఘిస్తోంది. పార్లమెంట్‌ను కించపరిచే విధంగా మోదీ వ్యాఖ్యలు చేయడం తగదు. దేవాలయంగా భావించే పార్లమెంట్‌పై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరం.
- కె. కేశవరావు, తెరాస ఎంపీ
ఇప్పటికే ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఇటీవల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీ విభజన అవమానకరంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తెరాస శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఇవాళ ఎంపీలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకే..
TRS MPs fires on PM Modi : 'భాజపా నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను అవమానిస్తున్నారు. 2009లో మా నాయకుడు కేసీఆర్ అమర నిరహార దీక్ష పట్టుకుని 11 రోజులు చేరుకున్నారు. ఆరోజు నేను పార్లమెంట్లో ఉన్నా.. డిసెంబర్ 9, 2009లో ఓవైపు కేసీఆర్ ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. మరోవైపు ప్రజలు తెలంగాణ కోసం పోరాడుతున్నారు. చరిత్రను తెలుసుకోకుండా.. ప్రధాని అలా మాట్లాడటం సరికాదు. ఇదంతా అక్కసుతోనే మోదీ అలా మాట్లాడారు.
- నామ నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభాపక్షనేత
ఇదీ చదవండి:
ప్రివిలేజ్ నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభ బహిష్కరణ