తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కొవిడ్ పాజిటివ్ నిర్దరణ అయినందున.. గత కొన్ని రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్ చేశారు. ఇటీవల ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు.
ఇదీ చూడండి : యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా