ETV Bharat / state

'హస్తానిది దిల్లీకో మాట... గల్లీలో మాట' - తెలంగాణ ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్

సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్​... తెలంగాణ పురపాలక ఛైర్మన్ల ఎన్నికలో భాజపాతో ఎలా కలిసిందని తెరాస ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్​ ప్రశ్నించారు. హస్తానిది దిల్లీలో ఒక వైఖరి, తెలంగాణలో మరో వైఖరని దుయ్యబట్టారు.

trs mla karne prabhakar fires on Congress party
'హస్తానిది దిల్లీకో మాట... గల్లీలో మాట'
author img

By

Published : Jan 28, 2020, 2:14 PM IST

'హస్తానిది దిల్లీకో మాట... గల్లీలో మాట'

కేంద్రం విధానాలను ప్రతిసారి తిరస్కరించే కాంగ్రెస్​ పార్టీ తెలంగాణలో భాజపాతో ఎలా పొత్తుపెట్టుకుందని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​ నిలదీశారు. హస్తం పార్టీ ద్వంద్వ నీతిని పసిగట్టిన ప్రజలు పురఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.

కేసీఆర్​ ప్రజలను నమ్ముకున్నారని, తెలంగాణ సర్కార్​ పట్ల ప్రజలకున్న విశ్వాసమే గులాబీ పార్టీకి మరోసారి పట్టం కట్టిందని కర్నె తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు, పేదలకు తెరాస అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నగరపాలక, పురపాలిక ఛైర్​పర్సన్లలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.